Showing posts with label kavitvam. Show all posts
Showing posts with label kavitvam. Show all posts

May 18, 2020

                                                       
వీలునామా    

  తాత                                                         తండ్రి                                         కొడుకు 


నీలాంబరం                                                 పీతాంబరం                                 ఆడంబరం 
సితారలు                                                    సినీతారలు                                జాతరలు 
ధాన్యపు పాతరలు                                        అవతారాలు                    పాపపుదొంతరలు

తేటనీరు, సెలయేరు                                     ఊటబావి, మోటచేద                  బురదగుంట 
జీవనదీనదాలు                                           కాలువలు,చెలమలు                  కల్మషకాసారం 
దట్టమైన కాంతారాలు                                   చిట్టడవులు                              రాతికానలు

ప్రణవం ,పురాణశ్రవణం                          ప్రణయం ,పరిణయం            ప్రళయం,కరాళనృత్యం 
వీణావాదనం                                         జానపదం ,జానుపదం          భేరినాదం 
వేణుగానం ,వేదం                                   అనుకరణ ,అనువాదం          విధ్వంసఖేదం 

ఆమని ,యామిని                                         జెమిని                                      భామిని 
చాతకాలు                                                    జాతకాలు                                  పాతకాలు 

 మంత్రతంత్రాలు                                            యంత్రజంత్రాలు                      కుట్రకుతంత్రాలు 
తాత్వికత                                                     భావుకత                                యాంత్రికత 
తర్కమీమాంస                                              (వి)వాదనాపటిమ                   వేదన,రోదన 
దాతృత్వం                                                      దాపరికం                                దోపిడి


                                                       "స్వ"గతం  కనరానిది 
                                                         స్వగతం  వినరానిది 

ఛిన్నాభిన్నం .అల్లకల్లోలం ,గందరగోళం  ఈ భూగోళం 
కాని మలితరం తలపు ఒకటయితే  హరి మలుపు మరొకటి 
కరోనా కబంధ హస్తం దేవుడిని ,వైద్యో  నారాయణో హరిని, జ్ఞప్తి చేసింది 
స్వజనం తో భోజనం , వితరణం ,బహుజనం విలువ తెలిపింది. 

స్వఛ్చత ,శుభ్రత,శిక్షణ ,క్రమశిక్షణ,రక్షణ ,పరిరక్షణ  పునరుజ్జీవించాయి

                 భువి ,భవి  మీవి 
                 యువతే భవిత
 


                   

January 25, 2014

నటసామ్రాట్



అతనెక్కని శిఖరం లేదని, అధిగమించని లోయ లేదని
కొండలన్నీ, బండలన్నీ గుండె రాయి చేసుకున్నాయా?

చెట్టులెక్కిన, పుట్టలెక్కిన వటవృక్షం నేలకూలినా
కాంతారాన కార్చిచ్చు ప్రజ్వరిల్లదేం?

నటకెరటంలా ఎగసి, కిందకి దిగని కళాకిరీటపు కలికితురాయి
జీవితరంగంలో శుభం పలికి నభం చేరితే
గంభీరసాగరాలు శోకసంద్రాలు కావేం?
బాడబాగ్ని ఉజ్వలించదేం?
   
నటనాఘటనాఘటనా సమర్థుడు మట్టిలో కలిస్తే
ధరణి నిశ్చేష్టయై నిశ్చలంగా, నిశ్చలనంగా నిలవదేం?
లేక -- శోక ప్రకంపనలతో తపించదేం?

నిస్వార్థం తార్కాణం "మనం"
అతను హంసగీతం పాడినా
నిలయవిద్వాంసులెవరూ
విలయ విధ్వంస గానం ఆలపించరేం?

ఏఎన్నారే లేని రేయన్నా పగలన్నా ఒకటేనని జనం కలకలం
గొంతుల్లో మింగలేని హాలాహలం
అక్కినేని చిక్కెనే అని అమరుల నాట్య కోలాహలం
ఆనందహేలనం

అవిగో గంధర్వ స్వాగత గానకచేరీలు
అల్లవిగో ఎదురుకోలు దేవధుంధుభులు
అభినయచక్రవర్తి, సిని"మా" రాజు, మీరాజు, మనరాజు
నట"నా"రాజు నటరాజులో లీనం
నేపథ్యంలో హృదయంలో వినిపించని విషాద వాయులీనం

మొదటి బాటసారి వేసిన, చూపిన రహదారిలో
అనంతమౌనం, నిర్లిప్త నిశ్శబ్ద గానం
గొలుసులో చివరి కొలికి తెగిన నాటితరం
అడుగులపై జాడలపై మనసాగాలి కొనసాగాలి
నేటినటతరం, నూతన తరంగం

బాష్పతర్పణం 
అక్షరాంజలి
అశ్రునీరాజనం    

 

September 20, 2010

HAIKUS

Mother's Nature
Baby kicks the womb
God knocks heart door
Expectant Mother.

FONDLING
Golden silence mine tiny totter
Silvery speech heard by world
my grown up daughter.


ఆశ

వటువుకు శిశువుకు మూడడుగులు
కల్యాణానికి నిర్వాణానికి ఏడడుగులు
కనరాని దూరం ధనాగారం .

అడవి కాచిన వెన్నెల
మెరుస్తున్న పచ్చిక బయలు సెలయేరు హొయలు
అడివంతా పచ్చగా విచ్చిన వెండి వెన్నెల
చూస్తున్న ఆహ్లాదిస్తున్న మనోనేత్రాలేన్ని ?



September 18, 2010

SAGES FOR AGES

Gales storms thunder above
Silver surf waves spray and splash
Rocks fearless stand alone

September 1, 2010

Birthday Haiku

35th Birthday


All books exhausted-
Older, heavier
At sunrise, none the wiser


How is that, eh? 


Looking forward to some good ones from G babai.

August 27, 2010

కవిత్యం.

కవిత్వం
పండిత రసిక జన రంజకమా ?
పామర జన మనో భంజకమా ?
'స్వ'భావ పరిచయమా?
ఎడ తెగని చర్చ
తెగని సమస్య .
ఎవరి పదచలనం
మన పద చలనం ఎద చలనం కలిగిస్తే
వారికే నా కరతాళం, కరచాలనం

August 26, 2010

PoeTREE dweller

వస్తుంది అందరికీ వేదాంతం--Everyone talks philosophy
కళ్ళ వెంట ధారాపాతం  ---there will be tears mushy
సమీపిస్తుంటే దేహాంతం--when the end of the bodily life is in sight
అందుకు ఇదే (58) దృష్టాంతం---this (58), is an example bright-right?



 జీవితం ఆద్యంతం --in this life from beginning to end
దొరకదు అందరికీ ప్రశాంతం--not all men (and women) get peace of mind
అందుకే ముఖ్యం శాంతం--that is why I say let us to tranquility bind
అనాయాసం గా ఉండాలి  మన అంతం -- finally we should have an easy way to wend


ప్రాసయే జీవిత పరమావధి? (కదా)- rhyme and rhythm we crave so bad
అందుకే సర్దు పదాలను! హతవిధీ --we adjust the lines to that end -oh God
దొరకటం లేదు నాకు వ్యవధి --I am TOO busy to put my pen to pad (Do you ever believe that old excuse?)
లేకుంటే రాయనా ఇలాంటివి రోజుకు పది --otherwise won't I ten such as this add (per day)


(చాలనుకుంటా ఈ ఎగతాళి వెధవది)--I think enough of this foolery and fad.


అందుకే --that is why


రావాలోయ్ భావావేశం --one should get real inspiration--like Gopal or Gouri may be
చెప్పాలోయ్ మనసు కవిత్వం --one should write from the heart
అకేషన్ కోసం రాసేది కపిత్వం (see title)--If you write for the occasion(or) parody, it is a fraud
మన (సు) కోసం రాసేదే నిలుస్తుంది నిత్యం--only the felt word will last forever.

August 24, 2010

Along similar (brooding) lines...

It seems that when one knows too much and understands too well (of human frailties maybe), somberness is the result- as reflected in G Babai's and G Pinni's recent posts. Came across this quote from Byron yesterday, which seems to say much the same:

Sorrow is knowledge; they who know the most
Must mourn the deepest o'er the fatal truth,
The Tree of Knowledge is not that of Life.

But then, I would also counter that viewpoint with this 2-liner from Ogden Nash:

When I consider how my life is spent,
I hardly ever repent.

58 (on 25/08/2010)

పుట్టినట్లుంది--- మొన్న
అమ్మో! ఇన్నాల్లయ్యిందా---నిన్న
ఇంకెంనాల్లో ----నేడు
ఉందొ లేదో రేపు

కరిగిపోతున్నది వయసు
విరిగిపోతున్నది మనసు



Behold I cannot
Values and relationships crumbling
Me and My mounting

For "me" the bell tolls!
merry- go-round of life never stalls


सौख्येना जीवनं (Soukhyena jeevanam--live life comfortably)
अनायेसेना मरणं (anayesena maranam-- die an easy death)
अन्तर्यामी त्वमेव सरनाम (Antaryamee twameva saranam--o inner being, God, you are the refuge)
याचितं भव सागर तरणं (Yachitam bhava sagara taranam--I beg you to take me across the sea of this world)


दुनिया है इक रंग रंग (the world is a stage colourful)
रहते कुछ दिन संग संग (stay together for some time)
जब होता ये सब भंग भंग (when the show is over)
आदमी बनता नंग अनंग (The being becomes a naked nonbeing)

ఈ బహు భాషా చౌచౌ
hope, conveys, my mind somehow.

GOWRI

రాఖీ.

బస్టాపులో రాక్షస ఇంద్రులు
వెయ్యి కళ్ళతో
అంగాంగ వర్ణన
వర్ణనాతీతం

తాకిడిని తడిమే చేతులని
భరిస్తూ సహిస్తూ
బస్సు ప్రయాణం
ప్రతిరోజూ ఆలస్యం
ఆడవారి ఉద్యోగం
నాకందుకే అసహ్యం
చిన్నబాసు భాష్యం

లోపలనే సంతకం
బహిరంగ రహస్యం
యజమాని లోకువగా అపహాస్యం
గుడ్లనీరు నోటకొంగు కుక్కుకొని
అవమానం భరించే అసహాయత్వం
ఎందుకిలా చచ్చింది మానవత్వం

కట్టించండి వీరిచే రక్షాబంధనం
కట్నంగా కోపాగ్నిని రగిలించే ఇంధనం
ఎదిరించే శక్తీ
వెట్టి నించి విముక్తి

సహనంతో ప్రేమతో సేవతో
ఒళ్ళు తుడిచి పుళ్లు కడిగి
మందుపూసి కట్టుకట్టి
మాత్ర వేసి సేద తీర్చి
నయిటిన్గేల్ వెళుతుంటే
వయోభేదం లేని రోగులు
ముసలినక్క
యువకకుక్క
ద్వందార్థ భాషణం
అత్యంత దారుణం
ఈ మానసికరోగుల కు
ఉన్న నాలికకు మందేసి
కొండనాలిక పోగొట్టాలి
చితక్కొట్టి విరక్కొట్టి
రాఖీలు వీరిచే కట్టించాలి

కాలేజీ వయసులోనే
మారేజీ ప్రపోసల్
తన మానాన తను వెళితే
తన నాన్నకు తను చెబితే
నువ్వేం చేశావని గద్దించి
తల వంచుకు నడవమని
తనలోనే ఏడవమని
తండ్రి తరహా
తల్లి సలహా

గొంతు కోసి
యాసిడ్ పోసి
గుండెకు గాయం చేసే
ఈవ్ టీసర్స్ ఆట కట్టించే
బ్రేవ్ సోల్జర్స్ కు
కట్టండి రాఖీలు

అన్నదమ్ముల రక్షణ శిక్షణ
వదినామరదళ్ళ సంరక్షణ ఆదరణ
అక్కాచెల్లెళ్ళ అనురాగం అభిమానం
సుగంధ చందనం
రక్షాబంధనం

















































August 19, 2010

కిష్టప్ప కిష్టం

పసి పాపడి చిరునవ్వు
పసి వాడని పువ్వు

తామరాకుపై నీటిబొట్టు
కూచిపూడి చీరకట్టు

ప్రణయంలో వెన్నెల హాయి
ప్రళయంలో వట పత్రశాయి

శీతాకాలపు తొలి తెలిమంచు
తెల్ల జరీ చీర సరిగంచు

దసరా శలవుల తర్వాత వీధిబడి
సరదా తగవుల తర్వాత అమ్మ వొడి

అమ్మ వొడి వెచ్చదనం
నారుమడి పచ్చదనం

ఏదైనా అత్యల్పం కారణం విపరీత వాగ్యుద్ధం
ఏమైనా శింగంపల్లి తోరణం ఆప్యాయతాబద్ధం




August 12, 2010

getting( balder-dash ) it.

In continuation of krips musings.
Face is vaguely familiar.You forgot him.He knows.He attacks with vengeance.Lacing your face with an apologetic smile,you give up and face him. Mundu oka ra tharvatha oka ra prathi word ki. here goes:-

Ye'ra' gurthu pattavat'ra'.Nenevaro cheppara. (struggle with bad memory.)
Ademiti. marchi poledu.
Ayithe evaro cheppu.? mischivous grin.
Accept defeat.Search for saviour Viswam who is as usual attending to sweets.
sarera x ni. Bathakhani.Who is where.
Hunger for torture not sated. Next imminent,unbearable,unwanted(u can add unlimited un tho starting adjectives} question .
Yera what happened to your hair? You used to have a stylish mop.
Embarassed. Appudu edo theliyaka.I was young ,ignorant,innocent.------ Mutter mutter. silly.

Total body scan. lavayyavu. Bojja kooda vachinde.
Neekenduku? Manasulo.
paiki. Iam doing some walking and exercises.
You can call Godsend, lucky charm.Manna.
Viswam enters. Era gadida kodaka maa annanu yedipisthunnava.Suththi.Recently"blah blah blah."

Torturer becomes tortured and disappears.

April 11, 2009

"खोज"

सुंदर ख्वाबों में भूल न जानी यादों में

मीठी बातों में मधुर गीतों में चान्दिनी रातों में

अंधेरी रास्ते पर तड़प रहा हूँ तुम्हारे लिए

होली में रंगोली में

बाराती मेले में सुझाई हरियाली में

मासूम बच्चों की बदनो में सच्चे प्यारे दिलों में

सागर की गहरायी में पहाड़ की ऊंचाई में

पैगाम की मुकाम में

ढूँढ रहा हूँ तुम्हे

उषा रवि किरणों में पूज्यों की चरणों में

सच्चाई के वास्ते लड़े रणों में

जीवन वन की हर चीज में

हिरण्य हरिण के जैसा

मिलता छूटता जा रहे हो तुम

हे भगवान! मैंने माना

तुम मेरे जान पहचान के अजनबी हो

जन्म लेते ही न जानते पाया हुआ बंदगी हो

तुम्हे पाने के लिए

धन नहीं मन

तन नहीं जान

हैवान हवन नहीं जीवन कवन

चाहिए

इसीलिए मैंने इस कविता लिखा

हज़ार जन्मो में सौ साल के लिए सबक सीखा

खोया हुआ सब खुशियाँ मुझे वापस मिला

मेरे जीवन की नवीन रंगीन मोड़ अभी अभी हिला

DEDICATED to POONAM

(SELFISH idea she will edit and repost)

April 5, 2009

ఉగాది కవి సమ్మేళనానికి చదివినది :

ఎందుకు పుట్టానో తెలియక
ఎప్పుడు చస్తానో భయపడుతూ
పిరికి వాళ్ళను భయపెడుతూ
పై వాళ్ళకు జైకొడుతూ


జాతకం లేని చాతకంలా
ఆకారం లేని చకోరంలా
కృష్ణ మేఘాలలో నీళ్లు వెతుకుతూ
మృగతృష్ణల్లో దప్పి తీర్చుకుంటూ
బంధుత్వాలు లేకుండా
సంతున్న వంధ్యత్వంతో
తూగుతూ సాగుతూ వాగుతూ బతుకుతున్నా

చీడ పురుగులా
పేడ పురుగులా
తప్పులు చేస్తూ తిప్పలు పడుతూ
తప్పుకుంటూ తిరుగుతున్నా
నలుగుతున్నా విరుగుతున్నా

విచ్చుకత్తుల్లా గుచ్చుకునే చచ్చు పుచ్చు మాటలతో యుద్ధం చేస్తూ
సాహిత్య వ్యవసాయం చేసి
కవిత్వ ఫలసాయం పొందుతున్నాననుకుంటూ
ఏదో రాస్తున్నానని భ్రమిస్తున్నా
నాచుట్టూ నేనే పరిభ్రమిస్తున్నా
నా కరచాలనం నేనే చేసుకుంటున్నా
నా కరతాళాలు నేనే వాయించుకుంటున్నా

నేను రక్కసిని
పగటి దయ్యాన్ని.

ఎందుకో ఆత్మశోధన మొదలైంది
అందుకే ఆవేదన కలిగింది
నాతొ నాకే వాదన జరిగింది

బోధి కింద లేకున్నా
కళ్ళున్న కబోదిని , వినిపించే బధిరుడినని
జ్ఞానం కలిగింది మది కదిలింది

అంతర్మధనంతో అంతర్ముఖుడినై ఆలోచించా
జీవిత పరమార్ధం చరమార్ధంలో కాదు
ప్రారంభంలో ప్రారభ్ధాన్ని శాసించాలని అవగతించా

వృద్ధాశ్రమంలో తాతను పెదనాన్నా అని పలకరించా పులకరించా
శరణాలయంలో చంటిపాపను కంటి పాపలా ఆదరించా
పదకన్నా అని స్వాగతించా సాదరించా

రోగులనూ విరాగులనూ సేవాధర్మంతో
ఆహ్లాదంగా నవ్వించా బాధలు మరిపించా మురిపించా
పేదల పతితల కష్టాలకు చలించా సానుభూతి సాయం అందించా
మనశ్శాంతితో ఫలించా అనుభూతితో స్పందించా

కష్టంలో అనుబంధం
దుఖంలో ఆనందం అనుభవించా సహకరించా
చర్మ సౌందర్యం కంటే కర్మ కర్తవ్యం విలువ అని నినదించా

నేను మనీషిని
సగటు జీవిని

బోయ మానిషాద శ్లోకం నుంచి ఆదికావ్యం ఉద్భవించింది
భయ విషాద శోకం నుంచి జనిస్తే ఒక్క వాక్యం
చాలు చాలు అదే పదివేలు
రసాత్మకం వాక్యం కావ్యం!!!



April 4, 2009

వదినా రెండు మాసాల కింద రాశా

ద్వంద్వార్థ పదాల ప్రయోగపు "ఆదాయం" "పన్ను " (pun)

SEE IT IS TAXING

సంపూర్ణ వాక్య నిర్మాణం మామూలుగా నీరసం ,రసహీనం

ఆరోగ్యం భాగ్యం ఆయావత్తు కోల్పోతే రోగం భాగం మాత్రం మిగులుతుంది ;
బాలేదేమో .
పూర్తి పద్యం లేదా గేయం సరళంగా లలితంగా గంభీరంగా ( పాషాణ పాకం )


రెండు ( అర్థాలను ) ( మళ్లీ pun ) ఒకటిగా చేసి
మురిపించడం
మరిపించడం


వదనంలో జీవకళ
హృదయంలో భావకళ

వదినా!
రసగంగ
తవ్వెయ్
తోడేయ్
టోపీలు తీశా

March 29, 2009

ఆడ పిల్ల తండ్రి

కన మమ సుతా కళ్యాణం కమనీయం
తిన మృష్టాన్న భోజనం మధురాతిమధురం
విన బంధుజన ప్రశంసలు కర్ణపేయం
చన మత్ హృదయకమలం జలద సంపూరం

March 26, 2009

అమ్మా అన్యాయం ! ఒప్పుకోను

మా విద్య బంగారు తల్లి
సుగుణాల రాశి, బంగారు బొమ్మ
ఎంత సేపూ పొగిడేది అల్లుడినేనా
మా అమ్మాయే అతడికి గొప్ప వరం.

ఉగాది

నూత్న సంవత్సరం నామ్నాఁ విరోధి
కావాలి కష్టాలకు నష్టాలకు విరోధి
కాకూడదు కొత్త ఎత్తులు ఎదగడానికి అవరోధి
కావాలి నూతన బంధానుబంధాలకు వారధి

March 25, 2009

Madhava

రూపమున రాధా మాధవుడు
కలిమిని రమా ధవుడు
కూడి విద్యామా (ధురి) ధవుడు
బంధుజన సుబాంధవుడు మా మాధవుడు.

33

THE SPOKEN WORD IS LIKE A TENNIS BALL
PLAYED TO AND FRO IN A GAME THAT DOESN'T PALL.
IT IS MADE OF SOME SUGAR AND SOME GALL
AND THE GAME IS PLAYED BY COUPLES ALL.--(VERBAL DUELS)

SOMETIMES THE POINT GOES TO HER
SOMETIMES IT GOES TO HIM.
THERE ARE TIMES OF ANGER
AND THERE ARE TIMES OF JOY TO THE BRIM

THIS IS WHAT WE LEARNT IN YEARS 33
AND THIS ADVICE WE DISPENSE FREE
SOMETIMES YOU MAY GET ON YOUR HIGH HORSE (OR TREE)
BUT YOU HAVE TO COME DOWN SINCE YOU ARE PURUSHA AND STREE
( NATURE CAN NEVER BE IN HARMONY IF THEY ARE NOT BALANCED AND TOGETHER)

FOR PARENTS STAY WITH US AND GO UP
CHILDREN COME TO US AND FLY AWAY
GRANDCHILDREN COME, CONQUER AND DEPART
BUT ONLY YOUR PARTNER IS THERE TILL DEATH DO PART.