పసి పాపడి చిరునవ్వు
పసి వాడని పువ్వు
తామరాకుపై నీటిబొట్టు
కూచిపూడి చీరకట్టు
ప్రణయంలో వెన్నెల హాయి
ప్రళయంలో వట పత్రశాయి
శీతాకాలపు తొలి తెలిమంచు
తెల్ల జరీ చీర సరిగంచు
దసరా శలవుల తర్వాత వీధిబడి
సరదా తగవుల తర్వాత అమ్మ వొడి
అమ్మ వొడి వెచ్చదనం
నారుమడి పచ్చదనం
ఏదైనా అత్యల్పం కారణం విపరీత వాగ్యుద్ధం
ఏమైనా శింగంపల్లి తోరణం ఆప్యాయతాబద్ధం