హలాలు పట్టి పొలాలు దున్ని
చెమట నీళ్ళతో నేలను తడిపి
ఆరుగాలము సేద్యం చేస్తే
వెన్నుల జారెను గింజలు చారెడు
రైతు కన్నుల కారెను పుట్టెడు
గుండెలు మండి కడుపులు కాలి
అప్పుల ఊబిలో కూరుకు పోయి
అమ్మక తప్పక అమ్మివేసెను
అమ్మ నేలను అంగడి సరుకుగ
తర్వాత
తల్లి గుండెను బద్దలు చేసి
రక్త మాంసములు రాళ్ళుగ మార్చి
పరచి వేసిరి పదముల కింద
రత్న గర్భ్హను ఛిద్రము చేసి
చల్లని తల్లిని వంధ్యను (barren) చేసిరి
ఏదో ఒక నాటికి
జానెడు పొట్టకు మెతుకులు లేక
మట్టి ముద్దలే అన్నము నీకు
తాగు నీటికి కటకట లాడ
కన్నీళ్ళే నీ దాహము తీర్చు
కడకు కాల్చుటకు కట్టెలు దొరకక కాకుల గద్దల పాలే నీవు
A poem by GOWRI.
PS: GHMC wants water meters for every connection as there is no water in and around Hyderabad. We had no rains for 4 years in Kavali.--No trees anywhere around Kavali--Only plots and it is the same everywhere.