ఒక కొడుకు కోసం తల్లితండ్రులు ఎదురు చూస్తుంటారు.
ఒక సోదరుడి కోసం అక్కాచెల్లెళ్ళు , అన్నదమ్ములు వేచి చూస్తుంటారుభర్త రాక కోసం "రాక కోసం చకోరంలా" భార్య పరితపిస్తుంటుంది.
తమ ప్రియమైన నాన్న కోసం పిల్లలు చూపుల తోరణాలు కడ్తుంటారు.
తన మిత్రులు,హితులు,ఊరి ప్రజలు
తిరిగి వస్తే అభినందించి సత్కరించటానికి,
అమరవీరుడయితే ఊరేగించి విషాద ,విషణ్ణ వీడ్కోలు పలకటానికి
ఉత్తేజంతో, ఉద్వేగంతో ప్రతీక్షిస్తుంటారు.
వస్తే పరమానందం.
రాకుంటే పరమఖేదం.
వైద్యశాలలో శుశ్రుతులు,శుశ్రూషకులు,రోగులు.
బాలింతలు,శిశువులు.
వైద్యశాలలో శుశ్రుతులు,శుశ్రూషకులు,రోగులు.
బాలింతలు,శిశువులు.
పాఠశాలలో విద్యార్థులు,అధ్యాపకులు
అమాయకజనులు,
ఎందుకు మరణిస్తున్నామో తెలియని నిస్సహాయులు.
మూతబడిన పరిశ్రమలు, వీధిన పడిన కుటుంబాలు
నిన్నటి దాకా జీవితం కళకళ
నేడు రేపు మిగిలినదంతా పీడకల.
తీరని వ్యధ.
ఎవరూ రచించని, ఎవరూ ప్రవచించని దీనగాధ.
యుద్ధకారకులు , సమరం కోరుకునేవారు ఆవహం ఆహ్వానిస్తారు కానీ చెయ్యరు .
యుద్ధం చేయవలసి వచ్చినవారు కదనం కాంక్షించరు
కానీ హవన సమిథలవుతారు.
ఇది మనం కన్నదే , అందరూ విన్నదే , ఎప్పుడూ ఉన్నదే
.