చెక్కుడురాయిమేడ వీధి తడిపొడిగోడలు
మెట్లకింది గది పెచ్చులూడి రాలుతున్న సున్నం
కటకటాల గవాక్షం పొడలుపొడలుగా అలుముకున్న నాచు
రెండంతస్థుల మేడ
వీధి మొగలో
ద్వారానికి అతికించిన నాతో మరోజీవి
మూరపొడుగు ముతకగుడ్డఫై అద్దెలేని సహజీవనం
ప్రాపంచికవరదాత వినాయకుడు గోడమీది బల్లి , మాలో తేడా అది నిరాహారి
జీతం నూరులో నాలుగో భాగం యంత్రాల లయబద్ధ శబ్దాలమధ్యలో
వ్యాపారగృహంలో చిరుద్యోగం చెవులు చిల్లిపడే కూతలు ,ప్రయాణీకుల సందడి
సుబ్బయ్య భోజనశాలలో భక్షణం మోతకూలీల చెవులుమోతెక్కించే కేకలు
తన కొడుకుకు విద్యాశిక్షణం పదిన్నరకు నిశీధిలో
వాల్తేరు రైలుస్టేషన్కి సాయంవ్యాహ్యాళి చీకటి ఏకాంత స్థావరానికి తిరుగుప్రయాణం
కాలందొర్లిస్తే గదిలో గుడ్డిదీపం నూనె తొందరగా అవదు ఖాళి
మేనత్త నివాసం గోదావరీతీర గ్రామంలో వధువుగా నాతో గృహప్రవేశం జరగకున్నా
అత్త మరిది కూతురికి ఈ దౌర్భాగ్యుడికి ప్రధానం తరచుగా తలపుల్లో అవతరిస్తుంది
ఇప్పుడు ఋజువైనట్లు ,పెట్టింది సుముహూర్తం ఉప్పాడ పట్టుచీరలో ,నుదుట కళ్యాణతిలకంతో
అప్పుడే మనం పలాయనం చిత్తగించాం
అమ్మాయికి ఆపద తప్పించిన అదృష్టం
నాపై కూడా విసిరిందో కటాక్షవీక్షణం
రిక్షాలపై ఖర్చు పెరిగింది జీతంలో తరుచు తరుగుదల
వీధిమలుపులో రాశులుపడిన మామిడితొక్కలు రాళ్లు
పనసపండు దళసరి తొక్కలు ,చేపల పొలుసులు,
చచ్చినపిల్లులు ,దేవుడికే తెలియాలి మిగిలిన చెత్త.
తరిగినజీతంలా విరిగిన చిల్లుల గొడుగు
ఉద్యోగశాల వస్త్రాలు గోపాలుడిఆత్మలా రసమయాలు
తేమగా ఉన్న గదిలో అడుగిడితే
చీకటినీడలా చిక్కటి వాన
వలలో చిక్కిన మెకంలా అపస్మారకంలో అచేతనంగా
నేనేమో కాళ్ళుచేతులు కట్టబడి
అర్థమృత ప్రపంచానికి బందీగా
వీధి చివరన నివసించే కన్నయ్య
మధ్యపాపిడిలో చక్కగా అటు ఇటు వేరయిన జుట్టు
విశాల నయనాలు కళాత్మక నైపుణ్యం
మురళీవాదనంలో అభిరుచి
అప్పుడప్పుడు భీతికొల్పే వీధిగాలిలో
విషాదనిషాదాలు తేలియాడతాయి
కొన్నిసార్లు దట్టమైన చీకటిరాత్రిలో ,సంధ్య కనువెలుగులలో
మధ్యాన్నపు వెలుగునీడలక్రీడలో ఒకసాయంత్రం
ఆకస్మాత్తుగా సింధుభైరవిరాగం కాటేస్తుంది
ఆకాశం ప్రతిధ్వనించేలా
నిత్యవిషాదంలో విడిపోయిన విరహపుజంటతో
అధాటున అవగతమయినది వీధి ఒక భ్రాంతి భ్రమ
తప్పతాగిన మైకంలో వదిరిన విషయాల్లా
హఠాత్తుగా గుండెలోకదలిక
అక్బర్ పాదూషా కి చిరుద్యోగి రామారావు కి మధ్య తేడాలేదు
వేణువువిషాదాలాపనలో జనించినరాగాలలో
శిథిలమైన గొడుగు, వైభవపురాజఛత్రం
ఏకంగా వైకుంఠద్వారంవైపు పైకెగుస్తాయి
ఆ అనంత సూర్యాస్తమయంలో
ఎక్కడ సంగీతం సత్యమో శివమో సుందరమో
అక్కడ గోదావరి ప్రవహిస్తూనే ఉంటుంది
నదీతటాల కొబ్బరిచెట్ల దట్టపునీడల్లో
ప్రాంగణంలో ఆమె వేచిఉంది
ఉప్పాడ పట్టుచీరలో ,నుదుట కళ్యాణతిలకంతో