అడగలేదు కాలేజీ admission లో కులం
ఇవ్వలేదు ఉద్యోగానికి ధనం
తీసుకోలేదు ప్రభుత్వోద్యోగి లంచం
కోరలేదు పెళ్ళికి అబ్బాయి కట్నం
అయ్యింది టమేటా తోటలో మాత్రమే ప్రియం
అలరారాయి రైతుల హృదయాలు నిరంతరం
నిండింది మిడిల్ క్లాసు షాపింగ్ సంచీ
కరిగింది నెల ఆదాయం లో మాత్రమే సగం
డబ్బిచ్చి అడగలేదు వోటు
ప్రజాసేవకే పాలిటిక్స్ అని చేసాడు నోటు
కావాలి ప్రజా హృదయాల్లో చోటు
లేకుంటే democracy కే చేటు
"అమ్మా!"-------
కళ్లు తెరిస్తే మంచం కింద నేను
పట్టేసిన నడుము తో లేవలేదు మేను
1 comment:
dreams never come true.
iam peessimistic.
Post a Comment