నిగూఢం నిక్షిప్తం హృదయాన్తర స్థితం
మేఘావృత జ్వలిత సూర్యం మన భావావేశం
కదిలించిన కపోత విలాపం
అందించింది రమణీయ రామాయణం
అక్కర్లేదు నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక ఇచ్చు కప్పురపు విడెంబు
చాలు ఒక మెరుపు ,ఒక పిలుపు ,ఒక వలపు ,ఒక తలపు
దాటేస్తాయి అంతరంగ భావ జలధి తరంగాలు చెలియలికట్ట
అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవితకనర్హం
ఉంటేచాలు కూసింత కళాహృదయం
రోంత కలారుధిరం
అంతే! ఆవిష్కృతం మధ్య మణి స్థగిత ముక్తావళి కాంచన కావ్యహారం
4 comments:
very well said. vadina peddananu srisrini oke rotlo vesi rubbavu.
akhari line lo madhya emiti?
Took me a long time (and lot of help from Mother) before I could get it...but it is good!
Pashana Pakam nee kavithwam,
Juttu peekkovali pathaka janam,
Rayakudadu simple ga padyam,
Ala rasthe emundi goppadanam!!!
Well, the first time around I got about 70% of pinni's poem,... till the explanatory piece from babai above. However the gist pinni, was clear even for the first time - even to a telugiite of modest calibre! A good responsive piece, thanks!
Post a Comment