నువ్వు ఎదుగుతున్నావని అందరూ అంటున్నారు.
తాతలు నానమ్మ అమ్మమ్మ ఆత్మీయులు ఎక్కడున్నా ఎన్నో కలలు కంటున్నారు.
కర్ణనయనాలు ఇటే పడేసి వీనుల,కనుల విందారగిస్తున్నారు.
తమ వంతుగా ప్రశంస ప్రోత్సాహం ఇస్తున్నారు.
పిల్లపిశాచంలా ఇల్లు పీకి పందిరేస్తుంటే చేష్టలుడిగిన ప్రేక్షకులం.
పరిణితి చెందుతూ యువ అద్భుతంగా మారుతుంటే మాటలుడిగిన వీక్షకులం.
( leaping ,bounding and roving imp is improving by leaps and bounds)
తప్పటడుగులు వేస్తూ
తప్పుటడుగులు వెయ్య , వెయ్యనివ్వ
కూడదని బాధ్యత నేర్పావ్.
నీకోసం అనవసరపు వ్యయం అహంకారం ఖర్చు రాసి
మాకోసం అత్యవసరపు ముద్దుమురిపెం మమకారం జమవేసి బాలన్స్ చేశాం.
కారు సీట్లో వెనక కూనిరాగాలు తీస్తూ వేషాలు వేస్తూ
వెనుతిరిగి చూడాలనే కుతూహలం అణచి

ముందుచూస్తూ నడపాలని
ముందుచూపుతో నడవాలని
ఏకాగ్రత నేర్పావ్.
నేర్చుకుంటూ నేర్పించాం.
ఇరువైపుల పెద్దలకి మా బాల్యం గుర్తు చేస్తూ ఆనందం పంచావ్. తీపి గుర్తులు జ్ఞప్తించావ్.
నీ చిన్నతనంలో తాత నానమ్మ,అమ్మమ్మ అని పిలిస్తే
ముందుచూపుతో నడవాలని
ఏకాగ్రత నేర్పావ్.
నేర్చుకుంటూ నేర్పించాం.
ఇరువైపుల పెద్దలకి మా బాల్యం గుర్తు చేస్తూ ఆనందం పంచావ్. తీపి గుర్తులు జ్ఞప్తించావ్.
నీ చిన్నతనంలో తాత నానమ్మ,అమ్మమ్మ అని పిలిస్తే
చిన్నతనం కాదని చిలిపిగా తెలిపి పెద్దరికం పెంచావ్.
మనవలు,మనవరాళ్లూ మనవాళ్ళన్న భావన
నీకందించే దీవెన వారికి జరలో రుజలో దివ్యౌషధం
తల్లి తండ్రుల పాత్ర నిచ్చి , ఆస్తులకన్నా ఆప్తులు కలకాలం ప్రధానమని
మా పెరుగుదల తో నీ ఎదుగుదల ఏకకాల విధానమని
అవగాహన పెంచావ్,మురిపించావ్, మైమరిపించావ్.
మనం ఎక్కవలసిన విమానాలు , సోపానాలూ
అధిగమించాల్సిన పరిణామాలు ప్రమాణాలు
వర్తమాన భవితల ప్రతినిధులమై
నియమితకాలంలో అందుకుంటూ
గతాన్ని కలుపుకు పోదాం .చేయూతనిద్దాం.
గడపలు దాటినా వీలైనంత కలసి గడపటం
నడక దారులు వేరైనా మేలైనంత నడత కలపటం.
వసుధైకమనకుటుంబం. మన ముఖచిత్రపటం.
సశేషం.
అంతులేని కథ.

8 comments:
Give me lot of time . I will try.
Good one Gopal. And the translation should be by the original author to bring out the nuances in the thought process.
నాకు బాగా నచ్చింది
మేము నీకు నేర్పటం కాదు
నీవు మాకు నేర్పావు
తప్పటడుగులు వెయ్యరాదని
ఏకాగ్రతతో ముందుచూపుతో నడవాలని.
అవగాహన పెంచావు,పెద్దరికం పెంచావు
మనం పిల్లల దగ్గరనుండి నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు వున్నాయనేది పెద్దలందరు అంగీకరించక తప్పని నగ్న సత్యం.
can you please translate gopal tatha
thank you
Takes time Arjuni.. trying.
Very good babai. It took me a few reads, given my rusty Telugu, but it was worth it.
Post a Comment