జానకి టిఫిన్ నా మొహాన పడేస్తే ఆఫీస్ కు చస్తా .మూడు బస్సులు మారి పోవాలి. లేట్ అయితే నా మొగుడు చంపుతాడు.
ఆ వెధవ నిద్ర లేచాడా .... ట్యూషన్ కు తగలడమను .. పరీక్షలు నెల లేవు .చదువు చంక నాకి పోతే అడుక్కు తినాలి .ఆ చాకలి కి గుడ్డలు వేసి చావద్దు.చొక్కాలు ఏడాది కూడా రావటం లేదు .ఇల్లు వాకిలి ఎగిరి పోయేట్టు అరుస్తున్న సీతారాం ను ఏమన లేక గుడ్ల నీళ్లు కుక్కు కున్నారు అమ్మ కొడుకు . చూస్తుండగానే ఈ ఈ అరుపుల తోనే ఆరేళ్ళు గడిచి పోయాయి
ఇంజనీరింగ్ పాస్ అయి క్యాంపస్ ప్లేసెమెంట్ లో ఇన్ఫోసిస్ లో ఉద్యోగం తెచ్చుకొని బెంగుళూరు వెళ్ళిపోయిన ప్రశాంత్ సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చాడు. అమ్మా నాతో నిన్ను తీసుకొని పోతాను ?ఇన్నాళ్లు ఈయన తో పడ్డ బాధలు చాలు ..నాతో వచ్చేయ్..
కొడుకు మాటలకు నవ్వి జానకి మీనాన్న సంగతి నీకేమి తెలుసని ఇట్లా అంటున్నావు .నీ కు స్కూల్ కు దూరమని అయన అయనమూడు బస్సులు మారి ఆఫీస్ కు వెళ్ళాడు .నీ కాలేజీ ఫీజు కోసంరాఁత్రి పూట పని చేసాడు .నలుగురిలో నీవు తక్కువగా ఫీల్ అవకూడదని రెండు చొక్కాలతో సర్దుకొని నీకు బట్టలు కొన్నాడు.ఇవ్వన్నీ కాదు ఇంకొక బిడ్డను భరించలేనని నేను ఆపరేషన్ కు ఉంఫిట్ అని ఆరేళ్ళు భర్తగా నానుంచి దూరంగా వున్నాడు .
మీ నాన్న ఆ మండే సూర్యుడు. ఆ వేడిని నువ్వు చూస్తున్నావు. సూర్యుడు లేకుంటే ఈ భూమి మీద జీవమే లేదు . తాను కాలి పోయి కరిగిపోయి జీవితాలు నిలబెట్టే సూరీడు మీ నాన్న. .ఇంట్లోకి వచ్చిన సీతారాం కాళ్ళ మీద పడి న కొడుకును వెధవా ఈ వేషాలు వద్దులే . జాబ్ చేస్తున్న పిల్లను చూస్తున్నాము ?నాలుగు రూపాయలు దాచుకో

1 comment:
Father's day special?
Post a Comment