November 22, 2009

ఆహ్వానం

My daughters say i'm only posting poetry and it may be monotonous.
If atleast one of the family members enquire, that is the license for me to post,they say.
Thank you anonymous {krupakar}. You are responsible for the coming multi-lingual onslaught.

పుష్కరాలు పుష్కలంగా ప్రతివారం వస్తుంటే
కృష్ణ గోదావరి నిష్కల్మషంగ ఉండవుగా !

మధుమాసం దరహాసం
మనకోసం ఆనునిమిషం
అదేపనిగ పూస్తుంటే
ప్రతిరోజూ వికసిస్తే
జనం మోజు నశిస్తే ?

ఆత్మబంధు ఆతిధ్యం
నిరంతరం ఆశిస్తే
తరచు తరచు తరచి తరచి
కుశలప్రశ్న అడిగేస్తే
విసుగెయ్యద కనిపిస్తే

ఎంటియారు ఏయన్నారు
దిలిప్కుమారు అమితాబు
పొందిరిగా మన కితాబు
పొందికగా నటియించక
ప్రతి పాత్రా ధరిస్తే
తప్పదుగా అవమానం
ఔచిత్యం మరువకుంటే
కీర్తికాయం శతమానం


హరివిల్లు తొలిజల్లు
అరుదైతే ఒళ్లుజల్లు
వేళాపాళా చూసి
బొండుమల్లి పరిమళాలు
అపుడపుడు వెదజల్లు
మధురంగా ఎదగిల్లు

పిలిస్తేనె పలకాలి
స్మరిస్తేనె కలవాలి
తేనె జాలు వారాలి
విరజాజులు విచ్చాలి
పిలువని పేరంటం
అలుపెరుగని పోరాటం
ఆపటమే తెలియకుంటే
తప్పదులే ఆటంకం

నలుగురికి నచ్చాలి
పదిమంది మెచ్చాలి
నడవడికలో ఒడిదుడుకులు
అదుపులోన ఉంచాలి

ఆబాలగోపాలుని మురళిరవము
ఈగోలగోపాలుని కవితాగానము
అస్తమానం విస్తరిస్తె
అనునిత్యం వినిపిస్తే
తినగతినగ తీపి చేదు
వినగవినగ స్ఫూర్తి రాదు

వేమన్న పలికిందల్లా నినాదం
విస్సన్న చెప్పిందల్లా వేదం
ఇది మాత్రం గోపన్న పిడివాదం

కానీ

సింగంపల్లి హాప్పెనిన్గ్సు
రంగవల్లి పెయిన్టింగ్సు
ప్రోగ్రెషనే కాని డిక్లరేషనే లేని
అనెన్డింగు హ్యాపీ ఇన్నింగ్సు




2 comments:

Krupakar said...

Excellent, babai, as usual! I translated it to the best of my ability to Poonam too, and she obviously liked it as well.

Krupakar said...

Anything in English?